Share News

MP Kiran Kumar Reddy: కాళేశ్వరం అవినీతిపై కేటీఆర్‌కు సమాధానం చెప్పే దమ్ము లేదు

ABN , Publish Date - Jul 16 , 2025 | 08:48 PM

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు.

MP Kiran Kumar Reddy: కాళేశ్వరం అవినీతిపై కేటీఆర్‌కు సమాధానం చెప్పే దమ్ము లేదు
MP Kiran Kumar Reddy

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కేటీఆర్‌(KTR) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వ్యాఖ్యలు చేయగా.. వాటికి దీటుగా కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను పెడితే పెళ్లి, ఇంకెవరు పెట్టినా పిండాకూడే అన్నాడట వెనకటికి అంటూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ సన్నాసి పదేళ్ల పాలనలో ఏం సాధించాడని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబద్ధతపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.


పదేళ్ల పాలనలో సాధించింది ఏంటి?

అసలు పదేళ్లు అధికారంలో ఉండి, కృష్ణా, గోదావరి నదులపై ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు తెచ్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కేటీఆర్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధత గురించి నోరు విప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేటీఆర్ పాలనలో కట్టినా, అది కూలిపోయింది.

ఈ ప్రాజెక్టు పేరిట హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధరరావు వంటి ఇంజనీర్లు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ లెక్కలు తేల్చే పనిలో ఉంటే, కేటీఆర్‌కు సమాధానం చెప్పే దమ్ము లేదు. తన రక్తాన్ని రంగరించి కాళేశ్వరం కట్టానని చెప్పే కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ ఎంతో తెలంగాణ ప్రజల ఊహకే వదిలేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


కాళోజీ పేరు తీసుకునే అర్హత కేటీఆర్‌కు ఉందా?

కాళోజీ వంటి మహాకవి పేరు తీసుకునే అర్హత కేటీఆర్‌కు ఉందా? తన ఫాంహౌస్‌లు, ప్రగతి భవన్‌లు పది నెలల్లో కట్టుకుని కులికిన ఈ దుర్మార్గుడు, వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని పదేళ్లు మొండి గోడలుగా వదిలేశాడు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని పూర్తి చేసింది. అయినా, కాళోజీ పేరు తీసుకోవడానికి కేటీఆర్‌కు సిగ్గు అనిపించడం లేదా అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.


తెలంగాణ సెంటిమెంట్‌ను దోచుకున్న కేటీఆర్

తెలంగాణ సెంటిమెంట్‌ను దోచుకుని, పార్టీ పేరు మార్చుకుని, ప్రజలను ఏమార్చిన కేటీఆర్‌కు ఈ రోజు తెలంగాణ భావోద్వేగాలు పట్టవా? అధికారం కోల్పోయిన కసితో, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య అనుమానాలు సృష్టించి, తెలంగాణ ప్రజల మెదళ్లలో విషం నింపాలని చూస్తున్నాడు. కానీ, ఈ కుట్రలు ఫలించవని ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు.


తెలంగాణ హక్కుల కోసం పోరాటం

తెలంగాణ హక్కుల కోసం దేవుడితోనైనా కొట్లాడతానని రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిజ్ఞ తెలంగాణ ప్రజల గుండెలను తాకింది. కానీ, తెలంగాణ భవిత కోసం దేవుడితోనే కాదు, కల్వకుంట్ల దెయ్యాలతో సైతం పోరాడాల్సిన అవసరం ఉందని ఈసారి గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజలు ఈ కేటీఆర్‌ లాంటి అవకాశవాదుల కుట్రలను ఎప్పటికీ సాగనివ్వరని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ సన్నాసి కేటీఆర్‌కు చరిత్ర ఒక గుణపాఠం నేర్పిందని, తెలంగాణ ప్రజలను ఎవరూ మోసం చేయలేరని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 08:57 PM