Egg Biryani: ఎగ్ బిర్యానీ భేష్..
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:06 AM
పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా అందిస్తున్న ఎగ్ బిర్యానీని రుచి చూసిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

- పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
- జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
- అంగన్వాడీ కేంద్రం, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ సిటీ: పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా అందిస్తున్న ఎగ్ బిర్యానీని రుచి చూసిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఎంజీనగర్‌లోని మురాద్‌నగర్, చాచా నెహ్రూనగర్‌లోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంధుల హాస్టల్, బస్తీ దవాఖానాలను కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, మెనూ ప్రకారం అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అంగన్వాడీ పాఠశాలలోని పిల్లలు కలెక్టర్‌కు స్వాగత పూర్వకంగా గులాబీ పువ్వు ఇవ్వగా చిరునవ్వుతో స్వీకరించారు. ఎలా చదువుతున్నారని, ఉపాధాయులు బాగా బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని సూచించారు. అనంతరం మురాద్‌నగర్, చాచా నెహూనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోని వాష్ బేసిన్, టాయిలెట్స్‌ను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని హెడ్ మాస్టర్‌ను ఆదేశించారు. పాఠశాలల్లో యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందాయా అని అడిగి తెలుసుకున్నారు. వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల హాస్టల్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి వారితో మాట్లాడారు. ఈ కేంద్రాల్లో ఎక్కువగా ఇంటర్ , డిగ్రీ , పీజీ పిల్లలు ఉండడంతో కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం చేయాలని, వారికి నాణ్యమైన ఆహారం అందించాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
బస్తీ దవాఖానాలో మందుల కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులపై జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఏడీ శ్రీనివా్‌సరెడ్డి సమగ్ర శిక్ష కో-ఆర్డినేటర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావు, సిడీఈఓ రేణుక, వార్డెన్ చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సాజిద్, డా.కార్తీక్, సూపర్‌వైజర్ రమ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News