Share News

Telangana sports policy: స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ!

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:48 AM

రాష్ట్రా న్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌లో తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని

Telangana sports policy: స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ!

  • నేడు స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌లో క్రీడా పాలసీని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్రా న్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌లో తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్‌ పాలసీ) ఆయన అధికారికంగా ఆవిష్కరించనున్నారు. దిగ్గజ క్రీడాకారులు అభినవ్‌ బింద్రా, పుల్లెల గోపీచంద్‌, గగన్‌ నారంగ్‌, అంజు బాబీ, అనిల్‌ కుంబ్లే సహా పలు అంతర్జాతీయ క్రీడా రంగ ప్రముఖులు, ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. శుక్రవారం శాట్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి తొమ్మిది ఎంఎన్‌సీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకోనుంది.


ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌..

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడి విజ్ఞాన్‌భవన్‌లో ఏఐసీసీ అనుబంధ ‘‘చట్టాలు, మానవ హక్కులు, ఆర్టీఐ’’ విభాగం.. రాజ్యాంగం సవాళ్లు- దృక్పథం, మార్గాలు థీమ్‌తో శనివారం నిర్వహించే మెగా ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనుండగా.. అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొని, ప్రసంగిస్తారు. అలాగే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు పాల్గొనడంతో పాటు ప్రసంగించనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వర కు జరిగే సెషన్‌లో ‘సామాజిక న్యాయం, రాజ్యాంగం: సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాధాన్యత’ అనే అంశంపై సీఎం రేవంత్‌ మాట్లాడనున్నారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంతో పాటు మరికొంత మంది కూడా ఇదే అంశంపై ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మం త్రులు, కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు కూడా హాజరుకానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 03:48 AM