CM Revanth Reddy: పర్శ సాయికి అండగా ఉంటాం..
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:26 AM
జనగామలోని కుర్మవాడకు చెందిన బాలుడు పర్శ సాయి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సాయం
ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జనగామలోని కుర్మవాడకు చెందిన బాలుడు పర్శ సాయి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘పర్శ సాయి దీన పరిస్థితి నా దృష్టికి వచ్చింది. ఆ బాలుడి ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆర్థిక స్థితి వివరాలు తెలుసుకుని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించాను. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పర్శ సాయి ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సాయికి నిమ్స్‌లో వైద్యం అందించడానికి నిర్ణయించారు’’ అని తెలిపారు.
‘కంచి’ ఆచార్యులు గణేశ్ శర్మకు అభినందనలు
కంచి కామకోటి పీఠం 71వ ఆచార్యులుగా దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ్ శర్మ అభిషేక వేడుక బుధవారం జరగనున్న నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయన రుగ్వేద పండితులుగా బాసర సరస్వతి దేవికి, తెలంగాణ ప్రాంతానికి ఎనలేని ధార్మిక సేవచేశారని గుర్తుచేశారు. ఈ గురు పరంపర ధర్మాన్ని, జ్ఞానాన్ని, శాంతిని సతతం అందించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
సీఎంను కలిసిన జస్టిస్ షమీమ్, జస్టిస్ శివశంకర్..
రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జస్టిస్ షమీమ్ అక్తర్, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ శివశంకర్ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం శుభాకాంక్షలు చెప్పారు. కాగా, రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవోగా నియామకమైన జయేశ్ రంజన్, అదే విభాగానికి అదనపు సీఈవోగా నియామకమైన ఐఏఎస్ ఈ.వీ నర్సింహారెడ్డి కూడా సీఎంను కలిశారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News