Secunderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలకు రండి..
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:39 AM
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.

సీఎం రేవంత్‌కు ఆహ్వాన పత్రిక
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు.. సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎంకు వేద ఆశీర్వచనం అందించారు. కాగా, ఈ నెల 29న అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఉండగా.. జూలై 13న మహంకాళి బోనాలు జరగనున్నాయి.