CM Revanth Reddy: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ముందుంటుంది..
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:50 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి సీపీఐ నేతలు సోమవారం జూబ్లీహిల్స్‌లో సీఎంని ఆయన నివాసంలో కలిశారు.అబ్దుల్లాపూర్‌మెట్, చేవెళ్ల, వరంగల్, భూపాలపల్లి, మేడ్చెల్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, పంచాయతీ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని, ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.