Osmania Hospital Liver Transplant: ప్రతి ప్రభుత్వ వైద్యుడికి మీరే ఆదర్శం
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:06 AM
కాలేయం పూర్తిగా చెడిపోవడంతో కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పదిహేడేళ్ల

ఉస్మానియా వైద్యులకు సీఎం అభినందనలు
ఓ బాలికకు కాలేయ మార్పిడి చేసిన వైద్యులు
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాలేయం పూర్తిగా చెడిపోవడంతో కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పదిహేడేళ్ల బాలిక బ్లెస్సీ గౌడ్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులను సీఎం రేవంత్ అభినందించారు. ఈ సందర్భంగా ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న దురభిప్రాయాన్ని చెరిపివేసి బ్లెస్సీకి 24 గంటల్లోపే విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించిన ఉస్మానియా వైద్య బృందానికి అభినందనలు. ప్రతి ప్రభుత్వ వైద్యుడికి వారు ఆదర్శం కావాలి. బీటెక్ విద్యార్థిని బ్లెస్సీ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీనికి ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని ట్యాగ్ చేశారు. కాలేయం పూర్తిగా చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్లెస్సీ గౌడ్‌కు ‘జీవన్‌దాన్ సూపర్ అర్జంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్ టీమ్’ నుంచి ప్రత్యేక అనుమతితో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News