Grain Procurement: ధాన్యం సేకరణ తర్వాత తనిఖీలు చేపట్టాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:57 AM
ప్రతి సీజన్ ముగిసిన వెంటనే ధాన్యం నిల్వలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భౌతిక తనిఖీలు(ఫిజికల్ వెరిఫికేషన్) చేపట్టాలని

ఎస్‌వోపీ జారీ చేసిన కేంద్ర ఆహార పంపిణీ శాఖ
ప్రతి సీజన్ ముగిసిన వెంటనే ధాన్యం నిల్వలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భౌతిక తనిఖీలు(ఫిజికల్ వెరిఫికేషన్) చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎ్‌సవోపీ)ను కేంద్ర వినియోగదారులు, ఆహార పంపిణీ శాఖ జారీ చేసింది. ఏ సీజన్‌లో అయినా ధాన్యం సేకరణ ముగిసిన వెంటనే భౌతిక తనిఖీలు నిర్వహించాలని, 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ నిల్వలు గుట్టలుగా ఉంటే... వాటిని 3 రోజుల్లో క్రమబద్ధీకరించాలని, లేకపోతే వాటిని నిల్వలుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. ధాన్యం మర ఆడించడానికి అదనపు గడువు పొడిగించాలని కోరే రాష్ట్రాలు... ముందుగా మిగిలిన నిల్వలపై కనీసం 10 శాతం మిల్లుల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News