Share News

Pending Bills: పెండింగ్‌ బకాయిలు ఇప్పించండి

ABN , Publish Date - May 29 , 2025 | 03:44 AM

రోడ్లు భవనాల శాఖ పరిఽధిలో పెం డింగ్‌లో ఉన్న బకాయిలు ఇప్పించాలంటూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్‌ను బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం డియా తెలంగాణ ప్రతినిధులు కోరారు.

Pending Bills: పెండింగ్‌ బకాయిలు ఇప్పించండి

  • ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రోడ్లు భవనాల శాఖ పరిఽధిలో పెం డింగ్‌లో ఉన్న బకాయిలు ఇప్పించాలంటూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికా్‌సరాజ్‌ను బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇం డియా తెలంగాణ ప్రతినిధులు కోరారు. బుధవా రం వికా్‌సరాజ్‌ను సచివాలయంలోని చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్ల విలువ చేసే పనులు జరుగుతున్నాయని.. వాటిని సకాలంలో పూర్తి చేయాలంటే గత బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌ పనులకు రూ.2,300 కోట్ల బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.


గతంలో చేసిన పనులు, వాటి బిల్లులపై స్పష్టత కోసం అవసరమైతే శాఖలోని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన దాదాపు 30 వేల కిమీ హ్యామ్‌ రోడ్ల పనులూ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమ బకాయిలతో పాటు కాంట్రాక్టర్లకు ఇస్తామని చెబుతున్న 40ు నిధులను అందిస్తే నిర్మాణాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి, రాష్ట్ర చైర్మన్‌ సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:07 PM