Share News

BRS: సిగాచి పరిహారంపై హరీశ్‌ తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:20 AM

సిగాచి పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారంపై బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఎ ఫహీం ఆరోపించారు.

BRS: సిగాచి పరిహారంపై హరీశ్‌ తప్పుడు ప్రచారం

  • ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఎ ఫహీం

హైద‌‌‌రాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారంపై బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఎ ఫహీం ఆరోపించారు. ఈ ప్రమాద మృతుల్లో 46 మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, మరో 15 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించామని సోమవారం గాంధీ భవన్‌లో మీడియాకు చెప్పారు. మృతదేహాలు అదృశ్యమైన వారి కుటుంబాలకూ రూ. 15 లక్షల చొప్పున చెల్లించినట్లు వెల్లడించారు.


హరీశ్‌ రావు చెబుతున్న జస్టిన్‌ కుటుంబంలో ఆమె తండ్రికి ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసినట్లు సంగారెడ్డి కలెక్టర్‌ ఆధారాలిచ్చారని ఫహీం పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని హరీ్‌షరావు చూస్తున్నాడన్నారు. సిగాచి ప్రమాద స్థలానికెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడే గంటల తరబడి ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారని గుర్తు చేశారు. మూసాయిపేట, కొండగట్టు ప్రమాదాల్లో ఏ ఒక్క చోటికైనా కేసీఆర్‌ వెళ్లాడా అని నిలదీశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా బీఆర్‌ఎస్‌ నేతలకు శవ రాజకీయాలు చేయడమే తెలుసునన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 04:20 AM