Share News

N Ramchander Rao: జర్నలిస్టుల చెంప చెల్లుమనిపించాలనిపిస్తోందా?

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:05 AM

ఓ పత్రిక వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఖండించారు.

N Ramchander Rao: జర్నలిస్టుల చెంప చెల్లుమనిపించాలనిపిస్తోందా?

  • సీఎం వ్యాఖ్యలను ఖండించిన రాంచందర్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఓ పత్రిక వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఖండించారు. జర్నలిస్టుల చెంప చెల్లుమనిపించాలనిపిస్తోందంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం సబబేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై భౌతిక దాడికి దిగాలనిపిస్తుందని పరుషంగా మాట్లాడడం తగదన్నారు. సీఎం మాటలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తార్కాణంగా నిలుస్తాయని ఎక్స్‌లో విమర్శించారు.

Updated Date - Aug 02 , 2025 | 04:05 AM