Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్‌పై పారదర్శక విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:03 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్ చేయాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌కు ఎంపీ అర్వింద్ వినతి
న్యూఢిల్లీ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్ చేయాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై పారదర్శక విచారణకు కృషి చేయాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ కుటుంబాన్ని, కుట్రలో భాగస్వాములందరినీ న్యాయస్థానంలో నిలబెట్టేలా చూడాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.
ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం నేరస్థులపై చర్య తీసుకునే అవకాశంలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేకాదని, నేరపూరిత స్వభావంతో లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. 2019 నుంచి శారీరక దాడులు, నిరంతర వేధింపులకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. తన ఫోన్ కాల్స్, పడకగదులు, బాత్‌రూంలలో అక్రమంగా చొరబడేందుకు ఎంపీగా ఎన్నిక కాలేదన్నారు.