Share News

Mallu Bhatti Vikramarka: ప్రపంచ వ్యాప్త మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:53 AM

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి

Mallu Bhatti Vikramarka: ప్రపంచ వ్యాప్త మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి

  • ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులతో భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ) అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ పాలక వర్గ క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం శనివారం చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంసీహెచ్‌ఆర్‌డీలో జరిగింది.


ఈ సబ్‌కమిటీలో సభ్యులైన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ శాంతికుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఎంసీహెచ్‌ఆర్‌డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా నిలపాలని, దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లకు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు సహకరించాలని మంత్రులు చెప్పారు.

Updated Date - Jul 27 , 2025 | 03:53 AM