Share News

BC Leaders: బీసీలను మోసగించాలని చూస్తే ఉద్యమిస్తాం

ABN , Publish Date - Jul 16 , 2025 | 06:31 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తరువాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని..

BC Leaders: బీసీలను మోసగించాలని చూస్తే ఉద్యమిస్తాం

  • స్థానికంలో 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపమే

  • బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం మహాధర్నాలో నాయకులు

కవాడిగూడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తరువాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు. అమలు కాని హామీలు, ఆర్డినెన్స్‌ల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం చేపడతామని తెలిపారు. మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ తమిళనాడు తరహాలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు కావాలంటే ఈ అంశాన్ని రాజ్యాంగం 9వ షెడ్యూల్‌లో చేర్చేలా పార్లమెంటు ద్వారా చట్టం రూపొందించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే తెలంగాణలో భూకంపం సృష్టిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. జీవోలతో రిజర్వేషన్లు అమలు అవుతాయంటే ఇన్నాళ్లు ఎందుకివ్వలేదని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రశ్నించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, జోగురామన ్న, మాజీ స్పీకర్‌ ఎమ్మెల్సీ మధుసుదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jul 16 , 2025 | 06:31 AM