Share News

పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదమే లక్ష్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:26 AM

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడమే బీసీల లక్ష్యమని పలువురు వక్తలు అన్నారు.

పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదమే లక్ష్యం

  • బీసీ నినాదాన్ని బలంగా వినిపించాలి : ఆర్‌. కృష్ణయ్య

బర్కత్‌పుర, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడమే బీసీల లక్ష్యమని పలువురు వక్తలు అన్నారు. స్థానికసంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని దీన్ని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో ఆమోదింపజేసుకున్నప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. కాచిగూడ అభినందన్‌గ్రాండ్‌ హోటల్‌లో ఓబీసీ డెమొక్రటిక్‌ జేఏసీ చైర్మన్‌ కోల జనార్దన్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం శనివారం నిర్వహించారు.


ఇందులో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. బలమైన ఎజెండాతో బీసీ ఉద్యమాలు నిర్మించాలని, బీసీ నినాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, స్థానికసంస్థలు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కృషి ఫలితమన్నారు. మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు, పలు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 05:26 AM