Telangana Bar Council: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:19 PM
తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహా రెడ్డి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్, జులై 09: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహా రెడ్డి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ న్యాయవాదులు మృతి చెందితే.. వారి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే న్యాయవాదులకు వచ్చే ఆరోగ్య భీమాను రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వం గతంలో న్యాయవాదులకు హామీ ఇచ్చిన రూ. 100 కోట్లు వెంటనే చెల్లించాలని బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా.. 35 సంవత్సరాల పైబడిన ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో చోటు కల్పిస్తామని ఈ సందర్భంగా నరసింహా రెడ్డి తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బార్ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ జాతీయ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read:
వీడని ఉత్కంఠ.. ప్రియాంకతో డీకే భేటీ
గుడ్ న్యూస్.. SBI సహా 6 బ్యాంకుల్లో మినిమం ఛార్జీలు
For More Telangana News and Telugu News..