Share News

Ghatkesar: పోచారంలో బంగ్లాదేశీయుడి అరెస్టు

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:32 AM

పోచారంలో నకిలీ పత్రాలు సృష్టించిన బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఆధార్‌, పాన్‌, ఓటర్‌ కార్డులు నకిలీగా తయారు చేసి నివాసం ఉన్నాడు

Ghatkesar: పోచారంలో బంగ్లాదేశీయుడి అరెస్టు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలను సృష్టించి పోచారంలో నివాసముంటున్న ఓ బంగ్లాదేశ్‌ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం వెంకటసాయి ప్రేమ్‌నగర్‌ కాలనీలోని ఓ ఫ్లాట్‌లో షేక్‌ రషెల్‌ అలియాస్‌ ఎండీ రషెల్‌ (31) నివాసం ఉంటున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు రషెల్‌ ఇంటికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. రషెల్‌ నకిలీ ఆధార్‌, పాన్‌, ఓటర్‌ కార్డులను సృష్టించి, పశ్చిమ బెంగాల్‌ నుంచి చౌదరిగూడకు వచ్చి నివాసం ఉంటూ స్థానికంగా ఓ ప్రైౖవేటు సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇంట్లో సోదాలు చేయగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓటర్‌ కార్డు లభించింది. రషెల్‌ను అదుపులోకి తీసుకొని అతడి నుంచి రెండు ఫోన్లు, ఓటర్‌కార్డును స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 29 , 2025 | 03:32 AM