Bandi Sanjay: పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రత కల్పించండి
ABN , Publish Date - Apr 24 , 2025 | 03:43 AM
కశ్మీర్‌లో పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీ నళినీ ప్రభాత్‌ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. ఉగ్రదాడుల మధ్య పర్యాటకులు భయపడకుండండి అన్న ఆయన, కేంద్రం ఉగ్రవాదాన్ని 根పదలతో పేకిలించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

కశ్మీర్ డీజీపీని కోరిన బండి సంజయ్
జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చే యాత్రికులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కశ్మీర్ డీజీపీ నళినీ ప్రభాత్‌కు సూచించారు. ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం ఆయన యాత్రికుల భద్రతపై డీజీపీతో మాట్లాడారు. స్థానికంగా ఉండే హోటల్ యజమానులతోనూ ఫోన్‌లో మాట్లాడి ధైర్యంచెప్పారు. కశ్మీర్‌లో పర్యటించే యాత్రికులు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.