Bandi Sanjay BJP Telangana: ఈటల వ్యాఖ్యలపై స్పందించవద్దు
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:44 AM
హుజూరాబాద్ నుంచి శామీర్‌పేటకు వెళ్లిన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన సందర్భంలో

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు
అన్నీ అధిష్ఠానం చూసుకుంటుంది
బీజేపీ నేతలకు బండి సంజయ్ సూచన
కరీంనగర్/హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ నుంచి శామీర్‌పేటకు వెళ్లిన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలకు సూచించినట్లు తెలిసింది. ఈటల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈటల వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే ఈటల తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలోని పార్టీ నాయకులు, శ్రేణులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తూ బండి సంజయ్‌కి పెద్ద ఎత్తున ఫోన్లుచేశారు. దీంతో ‘‘దయచేసి ఏ ఒక్కరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మీడియా, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు. పార్టీ పరువును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ అంతర్గత వ్యవహారాలను జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. మీరెవరూ బహిరంగంగా మాట్లాడటానికి వీల్లేదు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. కేంద్ర పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి. పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయండి’’ అని సంజయ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News