Share News

Bandi Sanjay: అక్బరుద్దీన్‌ కాలేజీకి నోటీసులు ఇవ్వరేం?

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:28 AM

పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కాలేజీ జోలికి వెళ్లబోమని, ఒకవేళ చర్యలు తీసుకుంటే అన్యాయం జరుగుతుందని హైడ్రా కమిషనర్‌ చెప్పడం మూర్ఖత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: అక్బరుద్దీన్‌ కాలేజీకి నోటీసులు ఇవ్వరేం?

  • గరీబోళ్ల ఇళ్ల మీదకే హైడ్రాను పంపిస్తారా: సంజయ్‌

జగిత్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కాలేజీ జోలికి వెళ్లబోమని, ఒకవేళ చర్యలు తీసుకుంటే అన్యాయం జరుగుతుందని హైడ్రా కమిషనర్‌ చెప్పడం మూర్ఖత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా..? సంబంధిత అధికారి నిర్ణయమా..? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అక్బరుద్దీన్‌ ఒవైసీకి కొమ్ములున్నాయా..? ఎందుకు మినహాయింపు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. సోమవారం జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేటలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.


మూసీ పరీవాహక ప్రాంతంలో గుడిసెలు, చిన్న ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న వేలాది మంది పేదల నివాసాలను ప్రభుత్వం కూల్చివేసిందని.. వాళ్లు మనుషులు కాదా..? వాళ్ల ప్రాణాలకు విలువ లేదా..? అని నిలదీశారు. అక్బరుద్దీన్‌ కాలేజీ భవనానికి నోటీసులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేసిన వారికి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిస్తుంటే వత్తాసు పలుకుతారని.. ఇదేం పద్ధతి అని నిలదీశారు. ఒవైసీ ఆస్తులు, అరాచకాలకు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా..? వాళ్లు ఏమైనా కబ్జాలు చేయొచ్చా..? సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 08 , 2025 | 04:28 AM