Home » Akbaruddin Owaisi
పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు అంతా నగరం వెలుపలే అంటున్నారని చెప్పారు. వచ్చే పదేళ్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవడానికి రూపొందించిన ప్రణాళికలో హైదరాబాద్ దక్షిణ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు.
మంత్రి సీతక్క కలగజేసుకుని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదాంట్లో అర్థం లేదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని మరచి పదేపదే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం "మన ఊరు మన బడి" కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా నిర్మిస్తోన్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
ఇదేనా ప్రజాస్వామ్యం, ఇంత అన్యాయం చేస్తే ఎలా, ఇదేమైనా గాంధీభవన్ అనుకుంటున్నారా.. అంటూ మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా 2025-26 జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది ‘కచరా’ పాలన అని.. పదేళ్లపాటు ఎంజాయ్ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, ఏడు తరాలకు సరిపడా సంపాదించారని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ధరణిని ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆయన ఆరోపించారు.
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిని నిరసిస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ప్రజల కోసం పోరాడుతున్నారా ? లేకపోతే కుటుంబం కోసం పోరాటం చేయడానికి వచ్చారా? అని విరుచుకుపడ్డారు. అందినకాడికి దోచేశారని..
హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి.