Share News

Nampally Court: బండి సంజయ్‌కు ఊరట

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:48 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2023లో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొందరు బీఆర్‌ఎస్‌ నేతలను సంజయ్‌ ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చారంటూ నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Nampally Court: బండి సంజయ్‌కు ఊరట

  • మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నమోదైన కేసును కొట్టివేసిన కోర్టు

  • సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించిన

  • ప్రజాప్రతినిధుల న్యాయస్థానం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2023లో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొందరు బీఆర్‌ఎస్‌ నేతలను సంజయ్‌ ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చారంటూ నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై గురువారం తుది విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం సంజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కేసును కొట్టివేసింది. ఇక, 2021లో బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన తప్పుడు విమర్శలను నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, లంకల దీపక్‌రెడ్డి, రాహుల్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు జూబ్లీహిల్స్‌లో నిరసన తెలిపిన కేసులో నిందితులందరికి ఊరట లభించింది. ఈ కేసును కూడా నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Updated Date - Feb 21 , 2025 | 04:48 AM