ఐఎస్‌బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:03 AM
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎ్‌సబీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌స)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాంపస్ లోని క్వార్టర్స్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

రాయదుర్గం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎ్‌సబీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌స)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాంపస్ లోని క్వార్టర్స్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37) ఐదేళ్లుగా ఐఎస్‌బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. క్యాంప్‌సలోని క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటున్నారు.
రెండేళ్లుగా మానసిక కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్న నిఖిల్ మదన్.. మంగళవారం రాత్రి తాను నివాసముంటున్న భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకారు. తీవ్ర గాయాల పాలైన ఆయన అక్కడికక్కడే మరణించినట్లు గచ్చిబౌలి ఎస్సై శిశుపాల్‌రెడ్డి తెలిపారు.