Share News

Domestic Violence: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గుడిసెకు నిప్పు

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:56 AM

మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధురాలి పూరి గుడిసెను సమీప బంధువు దహనం చేసిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం జరిగింది.

Domestic Violence: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలి గుడిసెకు నిప్పు

  • బంధువు దుశ్చర్య.. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఘటన

ఏటూరునాగారం రూరల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధురాలి పూరి గుడిసెను సమీప బంధువు దహనం చేసిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం జరిగింది. మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురానికి చెందిన నిరుపేద వృద్ధురాలు పలక సమ్మక్క ఓ పూరి గుడిసెలో ఒంటరిగా ఉంటోంది.


శనివారం ఆమె సమీప బంధువు పలక నాగరాజు అక్కడికి వచ్చి మద్యం తాగడానికి డబ్బులు కావాలని అడిగాడు. తన దగ్గర లేవని సమ్మక్క చెప్పడంతో నాగరాజు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టే వెళ్లి పక్కనే దాక్కొని గుడిసెకు నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడగా, గుడిసెలోని వస్తువులు కాలి బూడిదయ్యాయి.

Updated Date - Jun 29 , 2025 | 04:56 AM