Paramedical Promotions: పారామెడికల్ పదోన్నతుల్లో నిబంధనలకు నీళ్లు!
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:42 AM
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని పారామెడికల్ ఉద్యోగుల పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. నిబంధనలమేరకు పైస్థాయి నుం చి కాకుండా మధ్యక్యాడర్ నుంచి పదోన్నతులు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మధ్య క్యాడర్ వారికి పదోన్నతులివ్వడంపై అనుమానాలు
చక్రం తిప్పిన అధికార పార్టీ అనుబంధ సంఘ నేత!
సీఎం, వైద్య మంత్రి, హెల్త్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాల ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని పారామెడికల్ ఉద్యోగుల పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. నిబంధనలమేరకు పైస్థాయి నుం చి కాకుండా మధ్యక్యాడర్ నుంచి పదోన్నతులు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం.. సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యమంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినాకు ఫిర్యాదు చేసింది. పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని, పైస్థా యి నుంచి పదోన్నతులు చేపట్టాలని కోరింది. కొందరికి లబ్ధి చేకూర్చాలన్న ధోరణితోనే మధ్య క్యాడర్‌లో పదోన్నతులు చేపట్టారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రజారోగ్య సంచాలకుల విభాగం పారామెడికల్ విభాగంలో పదోన్నతులు చేపట్టింది. పారామెడికల్ విభాగంలో పలు రకాల క్యాడర్లు ఉండగా.. ఇందులో ఎంపీహెచ్‌ఏలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ), మల్టీ పర్పస్ హెల్త్ సూపర్‌వైజర్(ఎంపీహెచ్‌ఎ్‌స), మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(ఎంపీహెచ్‌ఈవో), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో) క్యాడర్లు ఉంటాయి. ఎంపీహెచ్‌ఏ నుంచి పదోన్నతి పొంది ఎంపీహెచ్‌ఎ్‌స అవుతారు. ఆ హోదాలో ప్రమోషన్ వస్తే ఎంపీహెచ్‌ఈవోగా.. ఆ క్యాడర్‌లో పదోన్నతి వస్తే సీహెచ్‌వో అవుతారు.
నిబంధనల ప్రకారం పై క్యాడర్ నుంచి అంటే ఎంపీహెచ్‌ఈవో క్యాడర్‌లో ముందుగా ప్రమోషన్ ఇస్తారు. ఆ హోదాలో పదోన్నతి పొందితే సీహెచ్‌వో అవుతారు. ఆ తర్వాత ఆ క్యాడర్‌లో పదోన్నతులు ఉండవు. సీహెచ్‌వోగానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. సీహెచ్‌వోలుగా పదవీ విరమణ తర్వాత ఖాళీగా ఉన్న ఆ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. అయితేప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం మాత్రం అందుకు విరుద్ధంగా మధ్య క్యాడర్‌లో ప్రమోషన్లు చేపట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జూలై 29న ఎంపీహెచ్‌ఎ్‌స క్యాడర్ వారికి ఎంపీహెచ్‌ఈవోగా పదోన్నతులు కల్పించారు. జోన్ 1, జోన్ 2 కలిపి మొత్తం 70 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. ఈరోజున పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని డీహెచ్ కార్యాలయం కోరింది. కేవలం 3 గంటలే ఆ వెబ్ ఆప్షన్స్ పనిచేశాయని, ఇలా ఎందుకు చేశారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత పదోన్నతి పొందిన వారికి ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ చేపట్టి, పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా మధ్య క్యాడర్‌లో పదోన్నతుల విషయంలో డబ్బులు చేతు లు మారాయన్న ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక వైద్యశాఖలోనే అఽధికార పార్టీకి అనుబంధ సంఘ నాయకుడు ఒకరున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్నతాఽధికారులపై ఒత్తిడి తెచ్చి మధ్య క్యాడర్‌కు ప్రమోషన్లు ఇచ్చినట్టు వివరిస్తున్నారు. కాగా ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ చేపట్టాక ఆర్డర్ కాపీ ఆన్‌లైన్ ద్వారానే పంపాలి. కానీ డీహెచ్ కార్యాలయ సిబ్బంది మాత్రం ఆర్డర్ కాపీలను ఆఫీసుకు వచ్చి తీసుకెళ్లాలంటున్నారు. ఆఫీసుకు రమ్మం టే.. కాసుల కోసమేనని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News