AI impact: ఏఐతో ఉద్యోగాలకు ముప్పే.. అయినా విస్మరించలేం
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:07 AM
కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పేనని, అయినా దానిని విస్మరిస్తే ఉద్యోగులైనా, కంపెనీలైనా తీవ్ర పశ్చాత్తాప పడాల్సిందేనని ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు స్పష్టం చేశారు.

జాతీయ సదస్సులో ఐటీ రంగ నిపుణులు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పేనని, అయినా దానిని విస్మరిస్తే ఉద్యోగులైనా, కంపెనీలైనా తీవ్ర పశ్చాత్తాప పడాల్సిందేనని ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు స్పష్టం చేశారు. ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు-ఏఐ’ అంశంపై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), 3ఏఐ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సదస్సుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్, టెక్ మహీంద్రా తదితర దిగ్గజ కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరయ్యారు.
ఏఐ ప్రభావంపై నిర్వహించిన వివిధ చర్చాగోష్ఠిల్లో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ ఎప్పటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంకాదని అందరూ అంటున్నారు కానీ నేడు మానవ మేధస్సు ఏఐపై ఆధారపడి ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఐటీతో పాటు ఇతర ఏ రంగాల్లోనైనా ఏఐ ఆధిపత్యం చలాయిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో రియల్ పేజ్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెచ్‌ఆర్ హెడ్ రేఖా నరేంద్ర, పెగా సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ స్ర్మితీ మాఽథుర్, 3ఏఐ సీఈవో సమీర్ ధన్‌రాజాని,ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు.