Hyderabad: రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:42 AM
ప్రముఖ హీరో రాజ్‌తరుణ్-లావణ్యల ప్రేమ కథా చిత్రం మళ్లీ.. తెరపైకి వచ్చింది. కోకాపేటలోని పావని విల్లాలోకి అతడి తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరి బుధవారం వెళ్లారు. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. తాము ఒక గదిలో ఉంటామని వారు పేర్కొన్నారు. కాగా.. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

- బైఠాయించిన దంపతులు
- ఫిర్యాదు అందలేద: పోలీసులు
హైదరాబాద్ సిటీ: హీరో రాజ్‌తరుణ్-లావణ్య(Hero Raj Tarun-Lavanya) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బుధవారం కోకాపేటలోని పావని విల్లాలోకి అతడి తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరి బుధవారం వెళ్లారు. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. తాము ఒక గదిలో ఉంటామని వారు పేర్కొన్నారు. తమను ఇంట్లో నుంచి గెంటేయడానికి వారు వచ్చారని లావణ్య ఆరోపించింది. తమ కేసు కోర్టులో ఉందని, రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు దౌర్జన్యం చేయడానికి వచ్చారని లావణ్య వాదించింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.15లక్షల రుణం కోసం 44.83 లక్షలు సమర్పణ
ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొంది. రాజేశ్వరి, బసవరాజు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకుంది. పోలీసుల అనుమతి తీసుకొని లోపలికి రావాలని ఆమె చెప్పింది. దీంతో వారు ఇంటి ఎదుట బైఠాయించారు. తమ కుమారుడు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొన్నాడని, తాము నడవలేకపోతున్నామని, న్యాయం చేయాలని వారు కోరారు. ఇంట్లో ఉండటానికి లావణ్యకు ఎలాంటి హక్కు లేదన్నారు. ఆ ఇంటి కోసం తాను కోటి రూపాయలు ఇచ్చానంటూ లావణ్య తండ్రి చేసిన వ్యాఖ్యలను రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఖండించారు.
రాజ్‌తరుణ్-లావణ్యకు పెళ్లి కాలేదని, మూడేళ్లపాటు కలిసిమెలసి ఉండి తర్వాత విడిపోయారని వారు తెలిపారు. ఇల్లు తమదేనని, లావణ్యను ఖాళీ చేయించి న్యాయం చేయాలని వారు కోరారు. తాము ఇక్కడికి వచ్చినట్లు రాజ్‌తరుణ్(Raj Tarun)కు తెలియదన్నారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు కోకాపేటలో రాజ్‌తరుణ్ ఇంటికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనపై తమకు ఎవరి నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News