Kukatpally: కూన శ్రీశైలం గౌడ్ సోదరుడి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:20 AM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడైన కూన శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తాళలేక ఆయన కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అంకెనపల్లి కుమార్ (28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కేపీహెచ్‌బీకాలనీ, జూలై28 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడైన కూన శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తాళలేక ఆయన కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అంకెనపల్లి కుమార్ (28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి వెంకటరావునగర్‌లో ఉండే కుమార్ ఎనిమిదేళ్లుగా బాచుపల్లిలోని శ్రీనివాస్ గౌడ్‌కు చెందిన సమ్మక్క-సారక్క క్రషర్ సంస్థలో పనిచేస్తున్నాడు. కుమార్ కారణంగా గత పది రోజుల్లో తనకు రూ.కోటి నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం అతడే చెల్లించాలంటూ శ్రీనివాస్ గౌడ్, అక్కడి సిబ్బంది కలిసి కుమార్‌ను వేధిస్తున్నారు. ఇంటికొచ్చి తల్లిదండ్రులు, భార్యను తగులబెడతామని అతడిని హెచ్చరించారు.
ఆదివారం కుమార్ కంపెనీకి వెళ్లగా.. అతడి ఫోన్, కారు, ఐడీ కార్డు ను లాక్కొని కొట్టారు. ఆ ఫోన్‌లో వ్యక్తిగత డేటా చూసి తీవ్రంగా అవమానించారు. అతడి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్‌చేసి ‘ఈ మొత్తం అంతా మాదే కదా’? అని ప్రశ్నించారు. అదేరోజు రాత్రి కుమార్ ఇంటికొచ్చాడు. జరిగిందంతా భార్యకు, ఫోన్ చేసి తన స్నేహితులకు చెప్పుకొని పడుకున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లోవాళ్లు లేచి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. కుమార్ భార్య బావోజు మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్‌కు 27 రోజుల వయసున్న కూతురు ఉంది.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..