Share News

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:08 AM

వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.

Vikarabad: మధ్యాహ్న భోజనం అందక విద్యార్థుల పస్తులు

బషీరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది. మూడు నెలలుగా బిల్లులు రాలేదని, సొంతంగా డబ్బులు పెట్టే స్థోమత తమకు లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు పిల్లలను మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు పంపించారు.


ఇళ్ల వద్ద కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో భోజనం చేయకుండానే పాఠశాలకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని పాఠశాల హెచ్‌ఎం తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 06:08 AM