Share News

TGSRTC: ఆర్టీసీలో తిరిగి విధుల్లోకి 136 మంది ఉద్యోగులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:41 AM

విధి నిర్వహణలో తప్పిదాల కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో 136 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. టీజీఎ్‌సఆర్టీసీలో విధుల నిర్వహణలో చిన్నచిన్న తప్పిదాలకు గత ప్రభుత్వంలో సుమారు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.

TGSRTC: ఆర్టీసీలో తిరిగి విధుల్లోకి 136 మంది ఉద్యోగులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో తప్పిదాల కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో 136 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. టీజీఎ్‌సఆర్టీసీలో విధుల నిర్వహణలో చిన్నచిన్న తప్పిదాలకు గత ప్రభుత్వంలో సుమారు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగం కోల్పోయిన వారు సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల్లో అప్పీలు మేళా నిర్వహించిన అధికారులు విచారణ తర్వాత 136మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మరో 41మంది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.


22న అన్ని సంఘాలతో జేఏసీ భేటీ

ఆర్టీసీలో సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసేందుకుగాను అన్ని సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 22న భేటీ అవుతున్నట్టు జేఏసీ చైర్మన్‌ వెంకన్న తెలిపారు. సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలన్నీ భేదాభిప్రాయాల్ని పక్కనబెట్టి ఐక్యతను చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 17 , 2025 | 04:41 AM