WhatsApp AI Features: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
ABN , Publish Date - Jul 09 , 2025 | 02:52 PM
వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్ల మన్ననలు పొందుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే యూజర్ అనుభవాన్ని మరింత పెంచేందుకు రెండు కొత్త ఫీచర్లతో (WhatsApp AI Features) వచ్చేస్తుంది. అవి ఏంటి, ఎలా పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ రెండు ఆసక్తికరమైన ఫీచర్లను (WhatsApp AI Features) తీసుకురానున్నట్లు తెలిపింది. వాటిలో ఏఐ పవర్డ్ చాట్ వాల్‌పేపర్ జనరేషన్, థ్రెడెడ్ మెసేజ్ రిప్లైలు ఉన్నాయి. ఇవి యూజర్ల చాటింగ్‌ను మరింత సులభతరం చేయనున్నాయి.
సొంత చాట్ వాల్‌పేపర్‌లు
వాట్సాప్ యూజర్లు ఇప్పుడు తమ చాట్ బ్యాక్‌గ్రౌండ్‌లను కొత్తగా, మరింత సృజనాత్మకంగా రూపొందించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తుంది. iOS యూజర్లు వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్ (25.19.75)కి అప్‌డేట్ చేసుకుంటే, ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది
ముందుగా వాట్సాప్ యాప్‌లో సెట్టింగ్స్ > చాట్స్ > డిఫాల్ట్ చాట్ థీమ్ > చాట్ థీమ్‌కు వెళ్లండి. అక్కడ కొత్తగా Create with AI అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేస్తే, ఒక పాప్ అప్ కార్డ్ ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ ఫీల్డ్‌లో మీకు కావాల్సిన వాల్‌పేపర్ డిజైన్‌ను వివరించే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఉదాహరణకు సముద్ర తీరంలో సూర్యాస్తమయం లేదా ఫ్లవర్ గార్డెన్ అని ఇవ్వడం ద్వారా మీకు కావాల్సిన AI జనరేటెడ్ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్‌లను స్క్రీన్ దిగువన ఉన్న ప్రివ్యూలను స్వైప్ చేసి చూడవచ్చు.
మరింతగా మార్పులు..
మీకు ఇంకా మార్పులు కావాలంటే Make Changes ఆప్షన్ ఉపయోగించి కొత్త ఇమేజ్‌లు జనరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇమేజ్‌ను సెలెక్ట్ చేసి, దాని పొజిషన్‌ను సర్దుబాటు చేసి, డార్క్ మోడ్‌లో బ్రైట్‌నెస్ స్లైడర్‌ను ఉపయోగించి సెట్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయడ్ బీటా వెర్షన్ 2.25.20.7లో టెస్ట్ చేసినప్పుడు ఇది పనిచేసింది. అయితే, కొన్నిసార్లు AI, యూజర్ ప్రాంప్ట్‌లోని కొన్ని డీటెయిల్స్ (రంగులు లేదా నిర్దిష్ట ఎలిమెంట్స్)ని పట్టించుకోకపోవడం వెలుగులోకి వచ్చింది.
థ్రెడెడ్ మెసేజ్ రిప్లైలు
వాట్సాప్ మరో ఉపయోగకరమైన ఫీచర్ కూడా రాబోతుంది. అది మెసేజ్ రిప్లైలను థ్రెడ్ ఫార్మాట్‌లో చూపించడం. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్‌లో ఉంది. త్వరలో iOS, Android బీటా టెస్టర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాయంతో సంభాషణలో రిప్లైలను ఒక క్రమబద్ధమైన థ్రెడ్‌లో చూడవచ్చు. దీనివల్ల మెసేజులను ట్రాక్ చేయడం సులభమవుతుంది. ప్రస్తుతం iMessage వంటి యాప్‌లలో ఇలాంటి థ్రెడెడ్ రిప్లై ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిన తర్వాత, గ్రూప్ చర్యలో లేదా వ్యక్తిగత మెసేజ్, రిప్లైలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి