Share News

Mahesh Goud: రిజర్వేషన్ల కోసం జాతీయస్థాయిలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:24 AM

జాతీయ స్థాయిలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని టీపీసీసీ

Mahesh Goud: రిజర్వేషన్ల కోసం జాతీయస్థాయిలో  బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

  • పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం, సురేఖ, శ్రీహరి

  • ఓబీసీ జాతీయ మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకాటి శ్రీహరిలు పిలుపునిచ్చారు. ఆగస్టు 7న గోవాలో జరుగనున్న ఓబీసీ జాతీయ మహాభలను విజయవంతం చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రచార వాల్‌ పోస్టర్లను బుధవారం మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, వాకాటి శ్రీహరిలు వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓబీసీ మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వారికి ఆహ్వాన పత్రికలను అందజేశారు. అనంతరం మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జాతీయస్థాయిలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు 42 శాతం రిజర్వేషన్ల పెంపుతో పాటు చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రైవేట్‌ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా బీసీ ఉద్యమ పోరాట కార్యాచరణను జాతీయ మహాసభలలో రూపొందించుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 05:24 AM