ChatGPT Solves Medical Mystery: డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..
ABN , Publish Date - Jul 07 , 2025 | 08:29 AM
ChatGPT Solves Medical Mystery: చాట్ జీపీటీ పరిష్కారం చూపిన వైద్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా 10 ఏళ్ల మెడికల్ మిస్టరీని చాట్ జీపీటీ సాల్వ్ చేసింది. డాక్టర్లు సైతం కనుక్కోలేకపోయిన ఓ వ్యక్తి ఆరోగ్య సమస్య ఏంటో ఇట్టే చేప్పేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న అద్భుతాలకు లెక్కలేదు. అన్ని రంగాల్లో ఏఐ తన సత్తా చాటుతోంది. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏఐ ఉపయోగపడుతోంది. పేరు పొందిన స్పెషలిస్టు డాక్టర్లకు కూడా సాధ్యపడని పనుల్ని ఏఐ సులువుగా చేసేస్తోంది. చాట్ జీపీటీ పరిష్కారం చూపిన వైద్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా 10 ఏళ్ల మెడికల్ మిస్టరీని చాట్ జీపీటీ సాల్వ్ చేసింది. డాక్టర్లు సైతం కనుక్కోలేకపోయిన ఓ వ్యక్తి ఆరోగ్య సమస్య ఏంటో ఇట్టే చేప్పేసింది.
చాట్ జీపీటీ పదేళ్ల తన మెడికల్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసిందో చెబుతూ.. ఓ వ్యక్తి తన రెడ్డిట్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో..‘దాదాపు పదేళ్లు కొన్ని వింత లక్షణాలతో బాధపడ్డాను. అసలు రోగం ఏంటో అర్థంకాలేదు. ఎమ్ఆర్ఐ చేయించుకున్నాను. అన్ని రకాల రక్త పరీక్షలు చేయించాను. లాభం లేకుండా పోయింది. దేశంలోనే టాప్ ర్యాంక్ డాక్టర్ల దగ్గరకు వెళ్లాను. న్యూరాలజిస్టు దగ్గరకు కూడా వెళ్లాను. నాకున్న సమస్య ఏంటో ఎవ్వరూ చెప్పలేకపోయారు. అయితే, ఓసారి నా రిపోర్టులను చాట్ జీపీటీకి చూపించాను.
అది నాకు ‘హోమోజైగస్ A1298C ఎమ్టీహెచ్ఎఫ్ఆర్ మ్యూటేషన్’ సమస్య ఉందని తేల్చింది. బీ12 లోపం కారణంగా నాకు ఆ సమస్య వచ్చినట్లు చెప్పింది. నా శరీరంలో సాధారణ బీ12 లెవెల్స్ ఉన్నా.. నా శరీరం దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతోంది. ఇందు కోసం బీ12 సప్లిమెంట్స్ తీసుకోమని సలహా ఇచ్చింది. నేను ఈ విషయాలను డాక్టర్‌కు చెప్పాను. ఆయన షాక్ అయ్యాడు. చాట్ జీపీటీ చెప్పిన దాని ప్రకారం డాక్టర్ చికిత్స చేశాడు. నా సమస్య చాలా వరకు తగ్గింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వ్యక్తి కూడా చాట్ జీపీటీ తనకు చేసిన సాయాన్ని చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల తన సమస్యకు చాట్ జీపీటీ పరిష్కారం చూపిందన్నాడు.
ఇవి కూడా చదవండి
మస్క్ కొత్త పార్టీపై ట్రంప్ విమర్శలు.. అది అయ్యేది కాదంటూ..
రీల్స్ పిచ్చి.. పట్టాలపై పడుకున్న బాలుడు.. చివరకు..