Share News

IPhone Satellite SOS: మనిషి ప్రాణం కాపాడిన ఐఫోన్ ఎస్ఓఎస్..

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:17 PM

IPhone Satellite SOS: అతడి కాలుకు గాయం అయింది. దీంతో ఎటూ నడవలేని పరిస్థితి ఏర్పడింది. 10 వేల అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయాడు. సాయం చేయడానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు.

IPhone Satellite SOS: మనిషి ప్రాణం కాపాడిన ఐఫోన్ ఎస్ఓఎస్..
IPhone Satellite SOS

ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ప్రాడెక్ట్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరీ ముఖ్యంగా ఐఫోన్స్‌ అంటే పడి చచ్చేవాళ్లు లేకపోలేదు. ఐఫోన్ కొనడానికి కిడ్నీలు అమ్ముకున్న వారు కూడా లేకపోలేదు. ఐఫోన్స్‌లోని సేఫ్టీ ఫీచర్స్ కంపెనీని టాప్‌లో ఉంచాయి. కంపెనీ తమ యూజర్ల సేఫ్టీ, సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఫీచర్లలో మార్పులు చేయడం లేదా కొత్త ఫీచర్లను తీసుకురావటం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఐఫోన్స్‌లో శాటిలైట్ బేస్డ్ ఎస్ఎమ్ఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.


సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉండని రిమోట్ ఏరియాల్లో కూడా శాటిలైట్ ద్వారా మెసేజ్లు పంపుకోవచ్చు. ఐఫోన్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఓ వ్యక్తి ప్రాణం కాపాడింది. ఎత్తైన పర్వతంపై ఇరుక్కుపోయిన అతడు.. ఐఫోన్ ఎస్ఓఎస్ ఉపయోగించి క్షేమంగా బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 53 ఏళ్ల ఓ పర్వతారోహకుడు కొన్ని రోజుల క్రితం ఓ మంచు పర్వతంపైకి ఎక్కాడు. 10 వేల అడుగులపైకి ఎక్కిన తర్వాత మళ్లీ కిందకు తిరుగు ప్రయాణం అయ్యాడు.


ఈ నేపథ్యంలోనే అతడి కాలుకు గాయం అయింది. దీంతో ఎటూ నడవలేని పరిస్థితి ఏర్పడింది. 10 వేల అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయాడు. సాయం చేయడానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికైనా ఫోన్ చేసి సాయం అడుగుదామంటే.. నెట్ వర్క్ లేదు. ఇలాంటి సమయంలో ఐఫోన్‌లోని ఎస్ఓఎస్ సర్వీస్ గుర్తుకు వచ్చింది. వెంటనే ఓ కుటుంబసభ్యుడికి మెసేజ్ పెట్టాడు. ఆ కుటుంబసభ్యుడు షరీఫ్ ఆఫీస్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఓ రెస్క్యూ టీమ్ మంచు పర్వతంపైకి వెళ్లింది. క్షేమంగా అతడ్ని వెనక్కు తిరిగి తీసుకువచ్చింది.


ఇవి కూడా చదవండి

ట్రంప్ ముందు మోదీ తలొంచుతారు.. రాహుల్ సెటైర్లు..

ఫోన్‌కు ఎడిక్ట్ అయిన కూతురు.. తల్లి చేసిన ఒక్క పనితో.. చివరకు..

Updated Date - Jul 05 , 2025 | 12:23 PM