22845 Crore Cyber Fraud: మరీ ఇంత దారుణమా.. ఇండియన్స్ నుంచి 22 వేల కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు..
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:06 PM
22845 Crore Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరి పోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక్క కారణం.. జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపటమే.

గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఏటా లక్షల కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో ఇండియన్స్ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మీడియా, టెక్ కంపెనీ నివేదిక ప్రకారం.. సైబర్ నేరాల కారణంగా 2024 సంవత్సరంలో ఇండియన్స్ ఏకంగా 22,842 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి..
2022 సంవత్సరంలో సైబర్ నేరాల కారణంగా ఇండియన్స్ 2,306 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మరుసటి సంవత్సరానికి ఆ మొత్తం పెరిగింది. 2023లో త్రిబుల్ అయింది. ఆ ఏడాది 7,465 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల పాలయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా ప్రకారం.. మన ఇండియన్స్ ఈ ఏడాది ఏకంగా 1.2 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇక, 2019లో వేలల్లో మాత్రమే సైబర్ కంప్లైంట్స్ నమోదు అయ్యేవి. కానీ, ఈ ఐదారేళ్లలో పరిస్థితి దారుణంగా తయారైంది.
2023లో 15.6 లక్షల సైబర్ క్రైమ్ కంప్లైంట్లు నమోదు అయ్యాయి. మరుసటి సంవత్సరం .. 2024 నాటికి ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత తెలివి మీరి పోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా దేశంలో సైబర్ నేరాలు పెరగడానికి ఒకే ఒక్క కారణం.. జనం పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపటమే.
స్మార్ట్ ఫోన్ ఉన్న 90 శాతం మంది డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. ఫెడరల్ డేటా ప్రకారం.. 2025 జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా 1,90,000 యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ అక్షరాలా 24.03 లక్షల కోట్లుగా తెలుస్తోంది. 2013లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ 162 కోట్ల రూపాయలుగా ఉంది. 2025 జనవరి నెలలో ఏకంగా 18 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.
ఇవి కూడా చదవండి
8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ సారి అడ్డంగా దొరికిపోయింది..
ఫలించని పోరాటం.. వారం రోజుల తర్వాత ఇంటికి కవిన్ బాడీ..