WhatsApp Deleted Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్ ఎలా చదవాలి.. ఇలా చేస్తే చాలు..
ABN , Publish Date - Jul 07 , 2025 | 05:45 PM
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో వాట్సాప్ వినియోగించని వారు దాదాపు లేరనే చెప్పవచ్చు. ఈ యాప్ ప్రతి రోజూ వినియోగదారులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే గ్రూపులో ఎవరైనా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేస్తే, (WhatsApp Deleted Messages) ఇతర సభ్యులు ఆ మెసేజ్‌కు సంబంధించి ఆసక్తితో ఉంటారు. డిలీట్ అయిందంటే ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ఆ తొలగించిన మెసేజ్ కూడా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ కూడా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల అవసరం, సౌలభ్యం మేరకు వాట్సాప్ ఎప్పటికప్పుడు అనేక ఫీచర్లను తీసుకొస్తుంది. వీటిలో మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఇతర వినియోగదారులు ఉన్న గ్రూపులో మీరు పంపించిన మెసేజ్ ఏదైనా కారణం వల్ల మీరు డిలీట్ (WhatsApp Deleted Messages) చేయవచ్చు. ఆ తర్వాత చాట్‌బాక్స్‌లో ఆ మెసేజ్ పూర్తిగా తొలగించబడినట్లు కనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రూపులో ఉన్న పలువురు డిలీట్ చేసిన మెసేజ్ ఏంటని ఆసక్తితో ఉంటారు. కానీ తొలగించిన దానిని ఎలా చూడాలో అనేక మందికి తెలియదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో తొలగించబడిన మెసేజ్ కూడా ఈజీగా చూడవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsAppలో తొలగించబడిన సందేశాలను ఎలా చదవాలి
మీ వాట్సాప్ లో తొలగించిన మెసేజ్ తిరిగి పొందడానికి చిట్కాలు
మీ ముందుగా మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి
సెట్టింగ్‌లకు వెళ్లిన తర్వాత, నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోండి
ఆ తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి
ఆ వెంటనే నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ ఎంచుకోండి
ఇప్పుడు నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ ను ఎనేబుల్ చేయండి
ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ ఫోన్‌కు వచ్చే అన్ని నోటిఫికేషన్‌లు సేవ్ అవుతాయి.
మీకు పంపించిన మెసేజ్ ఎవరైనా డిలీట్ చేసినా, మీరు చూసుకోవచ్చు
నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత అక్కడ వాట్సాప్ చాట్ ఆప్షన్ ఎంచుకోండి. దీని తర్వాత మీరు వాట్సాప్ నుంచి తొలగించబడిన మెసేజులతోపాటు పాటు అన్ని నోటిఫికేషన్‌లను చూడవచ్చు.
డిలీట్ చేసిన మెసేజులు తిరిగి పొందవచ్చా (WhatsApp Deleted Messages)
మీ ఫోన్‌లో నోటిఫికేషన్ హిస్టరీ ఫీచర్ అందుబాటులో లేకపోతే, మీరు థర్డ్ పార్టీ యాప్‌ల సహాయం కూడా తీసుకోవచ్చు. వాట్సాప్ నుంచి తొలగించబడిన మెసేజులు తిరిగి పొందడంలో సహాయపడే కొన్ని ప్రముఖ యాప్‌లు Notisave, WhatsRemoved+ కలవు. ఈ యాప్‌లను ఉపయోగించే ముందు, వాటి గోప్యతా విధానం గురించి తెలుసుకుని ఉపయోగించండి.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి