Share News

Activate DND: స్పామ్ మార్కెటింగ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఇలా చేయండి..

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:55 PM

Activate DND: స్పామ్ మార్కెటింగ్ కాల్స్ వల్ల మన మనస్సాంతి చాలా వరకు దెబ్బతింటుంది. కేవలం కాల్స్ మాత్రమే కాదు.. మెసేజ్లు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయాయి.

Activate DND: స్పామ్ మార్కెటింగ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఇలా చేయండి..
Activate DND

ఈ మధ్య కాలంలో స్పామ్ మార్కెటింగ్ కాల్స్‌ల గోల బాగా పెరిగిపోయింది. బిజీగా పని చేసుకుంటున్న సమయంలో అన్‌నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేస్తే.. ‘సార్.. మా బ్యాంకులో మంచి లోన్ ఆఫర్ ఉంది. వింటారా?’ అంటూ బ్యాంక్ వాళ్లు. రోజులో కనీసం రెండు, మూడైనా ఇలాంటి కాల్స్ వస్తూ .. విసిగిస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి స్పామ్ మార్కెటింగ్ కాల్స్ వల్ల మన మనస్సాంతి చాలా వరకు దెబ్బతింటుంది. కేవలం కాల్స్ మాత్రమే కాదు.. మెసేజ్లు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ప్రతీ రోజు మనల్ని ఇబ్బంది పెట్టే స్పామ్ మార్కెటింగ్ కాల్స్ .. మెసేజ్‌లనుంచి ఇలా చేస్తే విముక్తి పొందొచ్చు.


ఫోన్‌లో డీఎన్‌డీ యాక్టివేట్ చేసుకోండి

డీఎన్‌డీ అంటే ‘డు నాట్ డిస్ట్రబ్’ అని అర్థం. మీరు గనుక మీ మొబైల్‌ ఫోన్‌లో డీఎన్‌డీ యాక్టివేట్ చేసుకుంటే స్పామ్, మార్కెటింగ్ కాల్స్.. మెసేజ్‌ల బెడద ఉండదు. డీఎన్‌డీని యాక్టివేట్ చేసుకోవాలంటే..

  • మొదటగా మీ ఫోన్‌లోని మెసేజింగ్ యాప్‌ను ఓపెన్ చేయండి

  • కొత్త మెసేజ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి

  • అక్కడ FULLY BLOCK అని టైప్ చేయండి

  • టోల్ ఫ్రీ నెంబర్ 1909కు మెసేజ్ సెండ్ చేయండి

ఇలా చేస్తే టెలీ మార్కెటింగ్ స్పామ్ కాల్స్, మెసేజ్‌లు బ్లాక్ అయిపోతాయి.


ట్రాయ్ వెబ్ సైట్ .. టెలికామ్ యాప్స్

ట్రాయ్ అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ‘నేషనల్ డునాట్ కాల్ రిజిస్టరీ’లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి. టెలికామ్ యాప్స్ ద్వారా కూడా డీఎన్‌డీ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ యాప్ అయినా సరే.. అందులో డీఎన్‌డీ సెట్టింగ్స్ తప్పని సరిగా ఉంటాయి. అందులోకి వెళ్లి ప్రిఫరెన్స్ ఎంపిక చేసుకుంటే ప్రమోషనల్ కాల్స్ ఆగిపోతాయి.


డీఎన్‌డీ యాక్టివేట్ అయినా కాల్స్ ఆగకపోతే..

ఒక వేళ మీ మొబైల్ ఫోన్‌లో డీఎన్‌డీ యాక్టివేషన్‌లో ఉన్నా.. స్పామ్ మార్కెటింగ్ కాల్స్, మెసేజ్‌లు వస్తుంటే రెండు పద్దతుల్ని ఫాలో అవ్వొచ్చు. మీకు ఒకే బ్యాంకు నుంచి తరచుగా ఫోన్ కాల్స్ వస్తుంటే.. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. మీరు గతంలో ’మార్కెటింగ్ కమ్యూనికేషన్’ను యాక్సెప్ట్ చేసి ఉంటే.. దాన్ని డిసేబుల్ చేయవచ్చు. రెండో పద్దతిలో మీరు నేరుగా 1909కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకపోతే ట్రాయ్ అధికారిక వెబ్ సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.


ఇవి కూడా చదవండి

అరుదైన సంఘటన.. 30 ఏళ్లు పిండం.. ఇప్పుడు శిశువు

సోదరులతో కలిసి భర్త హత్యకు ప్లాన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..

Updated Date - Aug 02 , 2025 | 06:05 PM