AI Predicts Our Bodies: ఫోన్ అడిక్షన్.. 25 ఏళ్లలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా?..
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:06 PM
సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్‌లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
సిగరెట్, మందు, డ్రగ్స్ అడిక్షన్ కంటే దారుణమైన.. ప్రమాదకరమైనది ఫోన్ అడిక్షన్. ఫోన్ అడిక్షన్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది. ప్రజల్ని మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తోంది. ఫోన్ అడిక్షన్ కారణంగా కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. వచ్చే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని పరిశోధనలు చెబుతున్నాయి. మనిషికి మనిషికి మధ్య సంబంధాలు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మానవ సంబంధాలు ఊహించిన దానికంటే ఎక్కువగా బలహీనపడతాయి.
ఏఐ చెప్పిన దారుణ భవిష్యత్ ఇదే..
సెల్ ఫోన్ అడిక్షన్ కారణంగా రానున్న 25 ఏళ్లలో మనిషి ఎలా మారతాడో ఏఐ దారుణమైన భవిష్యత్ చెప్పింది. సెల్ ఫోన్ అడిక్షన్ కారణంగా మనిషి జాంబీలా తయారు అవుతాడని అంటోంది. సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్‌లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది. ఏఐ తయారు చేసిన ఇమేజ్‌ను బట్టి సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిన వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సెల్ ఫోన్ అడిక్షన్‌తో వచ్చే సమస్యలు
ఏఐ చెబుతున్నదాని ప్రకారం.. హెయిర్ లాస్ మరింత పెరుగుతుంది. చిన్నతనంలోనే ముసలి వాళ్లలా కనిపిస్తారు. ముఖంపై ముడతలు వస్తాయి. నడుము, మెడ వంగిపోయి ఉంటుంది. చర్మం కాంతి కోల్పోయి పేలగా తయారు అవుతుంది. పొట్టకింది భాగంలో విపరీతంగా కొవ్వు పేరుకుపోతుంది. జాయింట్ స్టిఫ్‌నెస్ వస్తుంది. సరిగా నిలబడటానికి కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది. వరికోస్ వెయిన్స్ వస్తాయి. మొత్తానికి మనిషి ఓ జాంబీలాగా మారిపోతాడు.
ఇవి కూడా చదవండి
అమెరికా దగ్గర అణుబాంబులు.. ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమన్న ట్రంప్..
కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్.. ఇక నేరుగా అరట్టై అకౌంట్‌కు మెసేజ్ చేసేయొచ్చు!