ChatGPT - Shopify: చాట్‌జీపీటీతో షాపింగ్.. కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందా
ABN , Publish Date - Apr 24 , 2025 | 07:48 AM
ఈ-కామర్స్‌లో భాగమయ్యేందుకు చాట్‌జీపీటీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ దిశగా షాపిఫైతో చాట్‌జీపీటీ అనుసంధానం చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొందరు సరదా కోసం మరికొందరు వృత్తిపరమైన విషయాలకు చాట్‌జీపీటీని తెగ వాడేస్తున్నారు. అయితే, ఈ చాట్‌బాట్ పరిధిని మరింత విస్తృత పరిచేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చాట్‌జీపీటీ సాయంతో యూజర్లు షాపింగ్ చేసేందుకు అనువైన ఫీచర్‌ను కూడా రెడీ చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో జనాలకు సహకరించేందుకు వీలుగా చాట్‌జీపీటీ షాపిఫై అనే ఆన్‌మార్కెట్ ప్లే్స్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, చాట్‌జీపీటీ నుంచే నేరుగా షాపింగ్ చేసుకునే అవకాశం చిక్కుతుంది. అంతేకాకుండా, అందుబాటులో ఉన్న వివిధరకాల వస్తువుల వివరాలు, ధరలు, రివ్యూలు వంటివన్నీ చాట్‌జీపీటీని అడిగి మరీ తెలుసుకోవచ్చు. మన అవసరాలను అనుగూణమైన వస్తువులను చూపించమని కూడా కోరచ్చు.
ఆన్‌లైన్‌లో అన్ని రకాల సమాచారాన్ని వెతికేందుకు ప్రధాన వేదికగా చాట్‌జీపీటీని తీర్చిదిద్దాలని మాతృసంస్థ ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈకామర్స్‌కు దీన్ని విస్తరించేందుకు ప్రయత్ని్స్తోంది. దీంతో, ఆన్‌లైన్ షాపింగ్‌లో అమెజాన్ వంటి సంస్థలకు చాట్‌జీపీటీ నుంచి గట్టిపోటీ తప్పదన్న అంచనాలు ఉన్నాయి. షాపిఫైకి ఇప్పటికే విస్తృతమైన నెట్వర్క్ ఉంది. దీనికి చాట్‌జీపీటీ కూడా జతకూడితే ఓ కొత్త శకానికి నాంది పలికినట్టే అని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం యూజర్లు కోరిన సమాచారాన్ని బట్టి ఏఐ సూచనలు మాత్రమే చేస్తుంది. షాపిఫైతో చాట్‌జీపీటీ అనుసంధానం తరువాత టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా యూజర్లకు ఉత్పత్తులను కూడా సూచిస్తుంది. లైవ్ కెమెరా షేరింగ్ టూల్ కూడా అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు ఉన్నాయి.
కోడింగ్ కూడా సులువుగా చేసి పెట్టేస్తున్న ఏఐ చాట్‌బాట్‌ల తదుపరి మజిలీ ఈ-కామర్స్ కావడంలో వింతేమీ లేదని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. గూగుల్ కూడా జెమినీని ఈ కామర్స్‌కు అనుసంధానించే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ఓపెన్ ఏఐ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో, అసలేం జరుగుతోందా అన్న ఉత్కంఠ యూజర్లలో నెలకొంది.
ఇవి కూడా చదవండి:
యూపీఐని మించిన టెక్నాలజీ.. చైనా రూటే సపరేటు
జపాన్‌లో మరో అద్భుతం.. ఆరు గంటల వ్యవధిలో రైల్వే స్టేషన్ నిర్మాణం
చైనా అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి
Read Latest and Technology News