Share News

iPhone Alternatives: ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ కంటే బెటర్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చే యాండ్రాయిడ్ ఫోన్స్ ఇవే

ABN , Publish Date - May 20 , 2025 | 09:50 AM

ప్రీమియం ఫోన్ సెగ్మెంట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌కు గట్టి పోటీ ఇచ్చే టాప్ 5 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మరి వీటి ఫీచర్స్ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

iPhone Alternatives: ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ కంటే బెటర్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చే యాండ్రాయిడ్ ఫోన్స్ ఇవే
iPhone 16 Pro Max alternatives

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఏ18 ప్రో చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ టాప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువ. ఐఫోన్ 16తో పోటీపడేలా ఇతర సంస్థలు కూడా పలు మోడళ్లను రిలీజ్ చేశాయి. ఇవి ఐఫోన్‌ 16 ప్రోకు గట్టి పోటీ ఇవ్వగలవని నిపుణులు చెబుతున్నారు. మరి వీటిల్లో టాప్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్25 అల్ట్రా

200 ఎమ్‌పీ ప్రైమరీ సెన్సర్, 5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌తో ఇది ఐఫోన్‌కు గట్టి పోటీదారుగా నిలుస్తోంది. 6.9 అంగుళాల అమోఎల్‌ఈడీ డైనమిక్ డిస్‌ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేటు, స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్‌తో ఈ మోడల్‌లో టాప్‌లో ఉందని చెప్పకతప్పదు. ఎస్-పెన్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉండటంతో జనాల్లో ఈ ఫోన్‌పై మక్కువ ఎక్కువగానే ఉంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఇందులో ఉంది.


గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్

మార్కెట్‌లో ఐఫోన్‌ 16 ప్రోకు గట్టి పోటీ ఇస్తున్న మరో ప్రీమియం ఫోన్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్. 120 హెర్జ్ రిఫ్రెష్ రేటుతో 6.8 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, టెన్సార్ జీ4 చిప్‌సెట్, ట్రిపుల్ 50 ఎమ్‌పీ రియర్ కెమెరాతో పాటు హైరిజల్యూషన్ ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఏఐ ఫీచర్లు కూడా అనేకం అందుబాటులో ఉన్నాయి.

వీవో ఎక్స్200 ప్రో

ఐఫోన్‌లకు దీటుగా నిలిచే యాండ్రాయిడ్ ఫోన్లలో ఇదీ ఒకటి. ఇందులో 6.78 అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, 16జీబీ ర్యామ్ ఉన్నాయి. 200 ఎమ్‌పీ జీస్ రియర్ కెమెరా దీని ప్రధాన హైలైట్. ప్రొఫెషనల్ స్థాయి ఫొటోలను తీసుకోవచ్చు.


ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో

ఈ ఫోన్‌లో కూడా ఐఫోన్‌ తరహా అద్భుత ఫీచర్లు ఉన్నాయి. 120 హెర్జ్ రిఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల ఎమోఎల్‌ఈడీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉన్నాయి. యాండ్రాయిడ్ 15 ఓఎస్ ఉంది. అందుబాటు ధరల్లో గొప్ప కెమెరా ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ ఫోన్ తగినది.

షావోమీ 15 అల్ట్రా

ఈ కేటగిరీలో చివరి ఫోన్ షావోమీ 15 అల్‌ట్రా. ఇందులో కెమెరా ఫీచర్లు అద్భుతమని జనాలు చెబుతున్నారు. లైకా పవర్డ్ కెమెరా సిస్టమ్, స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్‌సెట్, 16జీబీ ర్యామ్ ఇందులో ఉన్నాయి. సర్క్యులర్ మాడ్యూల్‌ ఆధారిత ఆకర్షణీయమైన డిజైన్ దీని సొంతం. మొత్తం నాలుగు సెన్సర్లను ఇందులో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే

ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలాక్కూడా వాడొచ్చని తెలుసా

పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా

Read Latest and Technology News

Updated Date - May 20 , 2025 | 09:58 AM