Apple: ఆపిల్ ఐఫోన్ డిజైన్‌లో బిగ్ ఛేంజ్..మార్పులు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 12 , 2025 | 07:42 PM
టెక్ ప్రియులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆపిల్ 2027లో కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ డిజైన్‌లో మార్పు, ఫోల్డబుల్ ఫోన్ సహా పలు అంశాలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఆపిల్(Apple) ఐఫోన్ ప్రియులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ క్రమంలో ఆపిల్ 2027 నాటికి ఐఫోన్ డిజైన్‌లో భారీ మార్పులు చేయనుందని తెలిసింది. ఈ క్రమంలో ఐఫోన్ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఆపిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం రానున్న కొత్త ఐఫోన్ బెజెల్ రహిత ఆల్ గ్లాస్ లుక్‌తో రానున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో డిస్‌ప్లేలో ఫ్రంట్ కెమెరా హోల్‌తో సహా పూర్తిగా తొలగించనున్నారు. ఆపిల్ సెల్ఫీ కెమెరాను డిస్‌ప్లే కింద ఇంటిగ్రేట్ చేసే టెక్నాలజీపై పనిచేస్తోంది. దీంతో, ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి స్క్రీన్ కనిపించే అవకాశం ఉంది.
కాన్సెప్ట్ స్థాయిలోనే
ఈ విషయాన్ని మొదట ‘ది ఇన్ఫర్మేషన్’ రిపోర్ట్ ప్రస్తావించింది. మార్క్ గుర్మాన్ కూడా దీని వివరాలను మరింత స్పష్టం చేశారు. గుర్మాన్ ప్రకారం 2027 ఐఫోన్ “పూర్తిగా గ్లాస్‌తో, కర్వ్డ్ డిజైన్”ను కలిగి ఉంటుంది. ప్రస్తుత ఐఫోన్‌లు ఫ్రంట్, బ్యాక్‌లను గ్లాస్‌తో కలిగి ఉన్నప్పటికీ, ఈ కొత్త మోడల్ ఒకే కర్వ్డ్ గ్లాస్ పీస్‌లా కనిపించేలా డిజైన్ మాదిరిగా వస్తుంది. ర్యాప్ అరౌండ్ గ్లాస్ ఫోన్ ఆలోచన కొత్తది కాకపోయినా, ఇప్పటివరకు కాన్సెప్ట్ స్థాయిలోనే ఉంది. ఆపిల్ దీనిని 2027లో వాస్తవ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది.
సామ్‌సంగ్‌కు పోటీగా
డిజైన్ రిఫ్రెష్‌తో పాటు 2027లో ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను పరిచయం చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆపిల్ చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది. సామ్‌సంగ్, ఇతర కంపెనీల ఫోల్డబుల్ ఫోన్‌లతో నేరుగా పోటీపడేందుకు ఈ ఫోన్ రూపొందించబడింది. ఈ క్రమంలో ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్‌లోకి వస్తే మాత్రం సంచలనం సృష్టించే ఛాన్సుంది.
ఆగ్మెంటెడ్ రియాలిటీ
ఆపిల్ తన మొదటి ట్రూ స్మార్ట్ గ్లాసెస్‌ను 2027లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇవి మెటా-రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు పోటీగా రూపొందించబడ్డాయి. ఈ క్రమంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వేరబుల్ టెక్నాలజీలో ఆపిల్ మరింత లోతుగా అడుగుపెట్టాలని భావిస్తోంది. ఈ గ్లాసెస్ స్టైలిష్ డిజైన్‌తో పాటు అధునాతన AR ఫీచర్లను అందించే అవకాశం ఉంది.
సిరి కొత్త రూపం
2027 నాటికి సిరి కూడా స్మార్ట్‌గా మారనుంది. ఆపిల్ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) ద్వారా సిరి మరింత అధునాతన సామర్థ్యాలను పొందనుంది. ఈ ఫీచర్లను అందించేందుకు ఆపిల్ సర్వర్-సైడ్ AI చిప్స్‌ను డెవలప్ చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ఆపిల్ సిలికాన్ బృందం నేతృత్వం వహిస్తోంది. ఫలితంగా, సిరి మరింతగా ఏఐ సపోర్ట్ ద్వారా సందర్భోచిత సమాధానాలను అందించగలదు. 2027 ఎందుకు స్పెషల్ అంటే. ఇది ఐఫోన్ 20వ వార్షికోత్సవ సందర్భం. ఈ క్రమంలో ఆపిల్ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది.
ఇవి కూడా చదవండి
Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
US-China: ట్రేడ్ వార్‌కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి