Africa U19 Cricket: టాంజానియా చరిత్ర
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:48 AM
టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్‌కప్‌కి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. నైజీరియాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది

తొలిసారి అండర్-19 వరల్డ్‌క్‌పనకు అర్హత
న్యూఢిల్లీ: ఆఫ్రికా క్రికెట్ జట్టు టాంజానియా చరిత్ర సృష్టించింది. తొలిసారి అండర్-19 వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించింది. నైజీరియాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఆరు జట్ల రౌండ్ రాబిన్ లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ టాంజానియా విజయాలు సాధించింది. ఈ క్రమంలో 2026లో జరిగే జూనియర్ వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించిన 12వ జట్టుగా టాంజానియా నిలిచింది. 16 జట్ల టోర్నీలో ఆతిథ్య జట్టుగా జింబాబ్వేతోపాటు గత టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన 10 జట్లు నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఆసియా, ఈస్ట్ ఆసియా పసిఫిక్, ఐరోపా, అమెరికా రీజియన్ల నుంచి ఒక్కో జట్టు అర్హత సాధించాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..