Share News

Team India 2nd Test: గువాహటి టెస్ట్‌లో భారీ మార్పులు..? గిల్, కుల్దీప్ యాదవ్ దూరం కాబోతున్నారా..

ABN , Publish Date - Nov 19 , 2025 | 07:17 AM

నవంబర్ 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఈ కీలక మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దాదాపు దూరమైనట్టు సమచారం. జట్టుతో పాటు గిల్ కూడా ఇప్పటికే గువాహటికి వెళ్లాడు. అయితే మెడ గాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే

Team India 2nd Test: గువాహటి టెస్ట్‌లో భారీ మార్పులు..? గిల్, కుల్దీప్ యాదవ్ దూరం కాబోతున్నారా..
Team India

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా గువాహటిలో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టెస్ట్ సిరీస్‌ను టీమిండియా సమం చేయగలదు. నవంబర్ 22 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఈ కీలక మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దాదాపు దూరమైనట్టు సమచారం. జట్టుతో పాటు గిల్ కూడా ఇప్పటికే గువాహటికి వెళ్లాడు. అయితే మెడ గాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే (Shubman Gill injury).


గిల్ ఆరోగ్యం విషయంలో వైద్య బృందం తుది నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అతడికి విశ్రాంతి ఇవ్వాలనే అభిప్రాయం టీమ్ మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తోంది. ఇక, గి‌ల్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఆడకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ కూడా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడట. దీంతో అతడు అందుబాటులో ఉండేది కూడా అనుమానంగా మారింది. గిల్ గైర్హాజరీ కారణంగా రిషభ్ పంత్ ఈ టెస్ట్‌కు నాయకత్వం వహించే అవకాశాలు కనబడుతున్నాయి (Kuldeep Yadav injury).


గిల్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, రజత్ పటిదార్‌లలో ఒకరికి అవకాశం లభించవచ్చు (Rishabh Pant captain). ఇక, కుల్దీప్ స్థానంలో ఆడే స్పిన్నర్ ఎవరనే విషయంలో పూర్తి స్పష్టత లేదు. తుది జట్టు విషయంలో ఇప్పటికి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఏదేమైనా గువాహటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది.


ఇవి కూడా చదవండి:

భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 07:26 AM