Shubhman Gill: శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:42 PM
ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ఎన్నో ఆశ్చర్యకర రికార్డులకు కారణమైంది. గెలుపు ఖాయం అనుకున్న దశ నుంచి కనీసం డ్రా అయితే చాలు అనుకునే దశ వరకు చివరకు ఓటమి పాలైన టీమిండియా పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (TeamIndia) ఓటమి ఎన్నో ఆశ్చర్యకర రికార్డులకు కారణమైంది (Ind vs Eng). గెలుపు ఖాయం అనుకున్న స్థితి నుంచి కనీసం డ్రా అయితే చాలు అనుకునే దశ వరకు వచ్చి చివరకు ఓటమి పాలైన టీమిండియా పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అలాగే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) బ్యాటర్‌గా రాణించినప్పటికీ కెప్టెన్‌గా విఫలమై తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే (TeamIndia registers unwanted records).
ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఐదు సెంచరీలు నమోదైనప్పటికీ ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. తాజా మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (2 సెంచరీలు) చేశారు. ఇంగ్లండ్ తరఫు నుంచి ఓలీ పోప్, బెన్ డకెట్ మాత్రమే సెంచరీలు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా బౌలింగ్ వైఫల్యమే టీమిండియా కొంపముంచింది. ఇక, గత 77 సంవత్సరాల్లో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు అత్యధిక పరుగులు (352) సమర్పించుకున్న జట్టుగా కూడా టీమిండియా నిలిచింది.
నాలుగో ఇన్నింగ్స్‌లో 350 పరుగులను రెండు సార్లు డిఫెండ్ చేసుకోలేకపోయిన తొలి ఆసియా జట్టుగా కూడా టీమిండియా నిలిచింది. తాజా మ్యాచ్‌తో పాటు 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తోనే జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా టీమిండియా 350 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది.
ఇక, తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయిన టీమిండియా మూడో కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఇంతకు ముందు దిలీప్ వెంగ్‌సర్కార్ (1987- వెస్టిండీస్‌తో) కెప్టెన్‌గా తన టెస్ట్‌లోనే సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇక, విరాట్ కోహ్లీ (2014-ఆస్ట్రేలియాతో) కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. అయినా ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది.
ఇవీ చదవండి:
బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి