Jasprit Bumrah: బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:55 PM
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో అమోఘంగా రాణించినప్పటికీ బౌలింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే కాస్తా మెరుగ్గా రాణించాడు. మిగిలిన బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది (Ind vs Eng). బ్యాటింగ్‌లో అమోఘంగా రాణించినప్పటికీ బౌలింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాత్రమే కాస్తా మెరుగ్గా రాణించాడు. మిగిలిన బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అయితే ఐదు మ్యాచ్‌ల ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ సిరీస్ ఆరంభానికి ముందే ప్రకటించింది.
బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ మరింత పేలవంగా మారుతుంది. ఈ నేపథ్యంలో బుమ్రాను మొత్తం ఐదు టెస్ట్‌ల్లో ఆడించే ఆలోచన టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఉందా. ఈ ప్రశ్నకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సమాధానం చెప్పాడు. 'బుమ్రా ఎంత కీలక బౌలర్ అనేది మనందరికీ తెలుసు. అయితే అతడి వర్క్‌లోడ్‌ను కూడా మనం అర్థం చేసుకోవాలి. అతడి శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి. ముందుగా అనుకున్నట్టే బుమ్రా ఈ సిరీస్‌లో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడతాడు' అని గంభీర్ స్పష్టం చేశాడు.
'బుమ్రా ఈ సిరీస్‌లో మిగిలి ఉన్న నాలుగు టెస్ట్‌ల్లో రెండు మాత్రమే ఆడతాడు. ఆ రెండు ఏవి అనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. బుమ్రా లేకపోయినా టీమిండియా బౌలింగ్ ఎటాక్ మెరుగ్గానే ఉంది. వారికి తగినంత అనుభవం లేకపోవచ్చు. కానీ, వారి మీద మాకు నమ్మకం ఉంది. వారికి కూడా కాస్త సమయం ఇవ్వాలి. వారు కూడా కచ్చితంగా రాణించగలరు' అని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి:
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి