Shikhar Dhawan: ప్రేమలో కొత్త ఇన్నింగ్స్..ప్రియురాలిని పరిచయం చేసిన ధావన్
ABN , Publish Date - May 02 , 2025 | 01:38 PM
క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడూ అనేక విషయాలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

శిఖర్ ధావన్...ఈ పేరు వినగానే డాషింగ్ బ్యాటింగ్, గబ్బర్ సింగ్ స్టైల్ సెలబ్రేషన్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అతని పేరు క్రికెట్ కంటే ఎక్కువగా లవ్ స్టోరీ కారణంగా చర్చల్లో నిలిచాడు. ఇటీవల శిఖర్ తన సోషల్ మీడియా ఖాతాలో సోఫీ షైన్ అనే యువతితో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోకు క్యాప్షన్‌గా ఒక సింపుల్ హార్ట్ ఎమోజీని యాడ్ చేశాడు. అంతేకాదు మై లవ్ అని పేర్కొన్నాడు. ఇది చూసిన అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ పోస్ట్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ క్రమంలో మరికొంత మంది అభిమానులు, నెటిజన్లు ఈ ఫోటో గురించి, సోఫీ షైన్ గురించి వెతకడం మొదలుపెట్టారు.
శిఖర్ గర్ల్ ఫ్రెండ్
2025 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వైరల్ అయిన ఒక ఫోటోలో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఒక 'మిస్టరీ ఉమన్'తో కనిపించాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అనేక మీడియా సంస్థలు ఆ మహిళ సోఫీ షైన్ అని, ఆమె ఐర్లాండ్‌కు చెందిన యువతి అని పేర్కొన్నాయి. అయితే, శిఖర్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్రమంలో కీలక విషయాలను ప్రస్తావించారు. యాంకర్ శిఖర్ గర్ల్‌ఫ్రెండ్ గురించి అడిగినప్పుడు, మొదట అతను సమాధానం చెప్పడానికి సంకోచించాడు. కానీ తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు. నేను ఎవరి పేరూ చెప్పను. కానీ ఈ రూమ్‌లో అతి అందమైన అమ్మాయి నా గర్ల్‌ఫ్రెండ్ అన్నారు.
ఎప్పటి నుంచి లవ్ స్టోరీ..
ఆ క్షణంలో కెమెరా సోఫీ షైన్‌పై ఫోకస్ చేసింది. ఈ సంఘటనతో గాసిప్‌గా మొదలైన వార్త అధికారికంగా నిజమైంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ జంటను ఆశీర్వదిస్తూ పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోఫీ షైన్ గురించి ఇంకా పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ఆమె ఐర్లాండ్‌కు చెందిన యువతి అని, శిఖర్‌తో ఆమె సన్నిహిత సంబంధం కలిగి ఉందని మాత్రమే తెలుసు. ఈ జంట ఎప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారు. వారి లవ్ స్టోరీ ఎలా మొదలైందనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. శిఖర్ ధావన్ స్వయంగా ఐపీఎల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు. ఆయన అనుభవం, ఆటతీరు యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
PM Modi: ఇక్కడ శశి థరూర్..ఇది కొంత మందికి నిద్ర కూడా పట్టదన్న ప్రధాని మోదీ
GT vs SRH Prediction: నేటి హైదరాబాద్ vs గుజరాత్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..మనోళ్లు గెలుస్తారా లేక..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News