Share News

Sanjog Gupta: ఐసీసీ సీఈఓగా

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:01 AM

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఐసీసీ సీఈఓగా సంజోగ్‌ గుప్తా నియమితుడయ్యాడు.

Sanjog Gupta: ఐసీసీ సీఈఓగా

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సీఈఓగా సంజోగ్‌ గుప్తా నియమితుడయ్యాడు. సంజోగ్‌ పేరును ఐసీసీ చైర్మన్‌ జైషా సోమవారం అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం సంజోగ్‌ జియోస్టార్‌లో స్పోర్ట్స్‌ అండ్‌ లైవ్‌ ఎక్స్‌పీరియన్స్‌ విభాగానికి సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 2010లో స్టార్‌ ఇండియాలో జర్నలిస్టుగా చేరిన సంజోగ్‌ అంచెలంచెలుగా ఎదిగాడు. కొత్త క్రికెట్‌ వ్యూహాలను రూపకల్పన చేయడంలో, క్రీడా సంబంధిత వ్యాపార రంగంలో సంజోగ్‌కు అపార అనుభవముందని జైషా తెలిపాడు. ఇక, ఈ పోస్టుకు 25 దేశాల నుంచి 2,500 దరఖాస్తులు రాగా, వడపోత అనంతరం 12 మందితో తుది జాబితాను తయారు చేసి, వారి నుంచి సంజోగ్‌ను ఎంపిక చేశామన్నాడు.

Updated Date - Jul 08 , 2025 | 03:01 AM