Rohit Sharma: నాకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం లేదని మీరెలా చెప్పగలరు.. రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం..
ABN , Publish Date - Jul 19 , 2025 | 02:08 PM
రోహిత్ సారథ్యంలోని టీమిండియా టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. టెస్ట్ క్రికెట్‌లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా వెళ్లింది. అయితే ఈ ఏడాది మే నెలలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు

టీమిండియాకు నాయకత్వం వహించిన గొప్ప కెప్టెన్లలో రోహిత్ శర్మ (Rohit Sharma) ఒకడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా టీ-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. టెస్ట్ క్రికెట్‌లో కూడా మెరుగైన ఫలితాలు అందుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా వెళ్లింది. అయితే ఈ ఏడాది మే నెలలో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగాడు (Rohit Sharma Retirement). ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
రోహిత్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి బీసీసీఐ మాజీ సెలక్టర్ జతిన్ పరంజ్‌పే (Jatin Paranjpe) మాట్లాడారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రోహిత్‌తో సంభాషణను గుర్తు చేసుకున్నారు. 'రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నేను అతడితో మాట్లాడాను. తాను టెస్ట్ క్రికెట్‌తోనే కెరీర్ మొదలుపెట్టానని, తనకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం లేదని మీరెలా చెప్పగలరని అడిగాడు' అని జతిన్ చెప్పారు. టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తి లేదా అని తాను అడిగినందుకు రోహిత్ ఫీల్ అయ్యాడని కూడా జతిన్ తెలిపారు.
2024-25 సీజన్‌లో రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. స్వదేశంలో జరిగిన సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా నిరాశపరిచాడు. దీంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇంగ్లండ్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ముందే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ రోహిత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. రోహిత్ తర్వాత కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి