Share News

Rinku Singh Engagement: రింకు సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం..పిక్స్ వైరల్

ABN , Publish Date - Jun 08 , 2025 | 08:50 PM

భారత యంగ్ క్రికెటర్ రింకు సింగ్ ఇప్పుడు తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. సమాజ్ వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం (Rinku Singh Engagement) చేసుకున్నాడు. జూన్ 8న, లక్నోలోని ప్రఖ్యాత ఫైవ్ స్టార్ హోటల్‌ సెంట్రమ్‎లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

Rinku Singh Engagement: రింకు సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం..పిక్స్ వైరల్
Rinku Singh engagement

టీమిండియా యువ క్రికెటర్ రింకు సింగ్(Rinku Singh Engagement), సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ లైఫ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. జూన్ 8న ఆదివారం రోజు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. లక్నోలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ సెంట్రమ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఉంగరాల మార్పిడి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు. క్రికెట్ మైదానంలో ఫినిషింగ్ షాట్లతో దూకుడు చూపించే రింకు, జీవిత భాగస్వామిగా ప్రియా సరోజ్‌ను ఎంచుకోవడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీరి పెళ్లి నవంబర్ 18న వారణాసిలో జరగనుంది.


ప్రముఖ అతిథులు హాజరు

ఈ వేడుకలో రింకు సింగ్ తెల్లటి దుస్తులలో కనిపించగా, ప్రియా సరోజ్ గులాబీ రంగు దుస్తులు ధరించింది. ప్రియా సరోజ్ వేదికపైకి చేరుకోగానే, ఆమె నవ్వుతూ కనపించింది. తరువాత, ఇద్దరూ నవ్వుతూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ప్రొఫెసర్ రాంగోపాల్ యాదవ్, జయా బచ్చన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉన్నారు.


ప్రత్యేక వంటకాలు..

నిశ్చితార్థం కోసం ఇద్దరూ ప్రత్యేక ఉంగరాలను కొనుగోలు చేశారు. ప్రియ సరోజ్ కోల్‌కతా నుంచి ఒక డిజైనర్ ఉంగరాన్ని కొనుగోలు చేయగా, రింకు ముంబై నుంచి ఒక ప్రత్యేక ఉంగరాన్ని ఆర్డర్ చేశాడు. రెండు ఉంగరాల మొత్తం ధర దాదాపు రూ.2.5 లక్షలు ఉంటుందని తెలిసింది. ఈ జంట ఎంపిక ప్రకారం మెనూ కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. ప్రియా తనకు ఇష్టమైన బెంగాలీ వంటకాలైన రసగుల్లా, కాజు పనీర్ రోల్‌లను చేర్చింది. రింకుకు ఇష్టమైన పనీర్ టిక్కా, మటర్ మలై కూడా మెనూలో చేర్చారు.


రింకు సింగ్ కెరీర్

27 ఏళ్ల రింకు సింగ్ ఇటీవలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ రింకు సింగ్ 11 ఇన్నింగ్స్‌లలో 29.42 సగటు, 153.73 స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు చేశాడు. రింకు సింగ్ ఇప్పటివరకు భారతదేశం తరపున 2 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతను వన్డేలో 27.50 సగటుతో 55 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20లో రింకు 42.00 సగటుతో 546 పరుగులు చేశాడు.


ఇవీ చదవండి:

ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..


4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 08:57 PM