Share News

Palash proposal to Smriti: స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!

ABN , Publish Date - Nov 21 , 2025 | 05:02 PM

టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు ప్రియుడు పలాశ్ ముచ్చల్ అదిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మహిళలు వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం జరిగిన ఈ సన్నివేశానికి డీవై పాటిల్ స్టేడియం వేదికైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీరివురి మధ్య జరిగిన ఆ సర్‌ప్రైజ్ ఏంటో మీరూ తెలుసుకోండి.

Palash proposal to Smriti: స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!
Palash Muchhal surprise proposal to Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana).. ప్రియుడు పలాశ్ ముచ్చల్‌(Palash Muchhal)తో గడిపిన మధురానుభూతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లి పలాశ్ ప్రపోజ్ చేశాడు. మహిళలు వన్డే ప్రపంచకప్ గెలిచిన డీవై పాటిల్ స్డేడియం(DY Patil Stadium) ఇందుకు వేదికవ్వగా(World Cup final venue).. పలాశ్ దీన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'క్యూటెస్ట్ ప్రపోజల్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సర్‌ప్రైజ్ చేశాడిలా..

స్మృతి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోనున్న ఈ వీడియోలో భారత్ వరల్డ్ కప్ గెలిచిన అనంతరం పలాశ్.. స్మృతికి కళ్లకు గంతలు కట్టి మైదానం మధ్యలోకి తీసుకెళ్లాడు. తర్వాత ఆ గంతలు తీసేసి.. అతడు మోకాళ్లపై నిల్చుని తనదైన స్టైల్లో ఆమెకు రింగ్ బహూకరిస్తూ ప్రపోజ్ చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు(Palash Muchhal's surprise proposal to Smriti Mandhana). దీంతో భావోద్వేగానికి లోనైన స్మృతి.. ఆనందంగా ప్రియుడి ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసింది. ఈ సన్నివేశం తర్వాత.. భారత బ్యాట్స్ఉమెన్స్ జెమీమా రోడ్రిగ్స్, రాధాయాధవ్ తదితరులు సహా పలాశ్‌ స్నేహితులూ వారి దగ్గరకు చేరి సంబరాలను రెట్టింపు చేశారు. ప్రముఖ గాయని అయిన పలాశ్ సోదరి పాలక్ ముచ్చల్(Popular singer Palak Muchhal) కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.


స్మృతి, పలాశ్‌లు ఈ నెల 23న వివాహం చేసుకోబోతున్నారు. దీంతో కాబోయే ఈ నవ వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు(PM Modi extended his wishes to the star pair). వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ముందుకు సాగాలని కాంక్షిస్తూ.. ఇరువురికీ ఓ లేఖ రాశారు మోదీ.


ఇవీ చదవండి:

పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన

ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 21 , 2025 | 06:06 PM